అమెరికాలో చదువుకునే విదేశీ విద్యార్థులపై లక్ష డాలర్ల ఫీజు విధించే ప్రతిపాదనను ట్రంప్ వర్గం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఈ నిర్ణయం అమలులోకి వస్తే, భారతీయ విద్యార్థులపై భారీ ఆర్థిక భారం పడటంతో పాటు OPT (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్) అవకాశాలు దెబ్బతినే అవకాశం ఉంది.
అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లే వేలాది మంది భారతీయ విద్యార్థుల భవిష్యత్తుపై ఈ ప్రతిపాదన తీవ్ర ప్రభావం చూపుతుందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.