
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పనపల్లిలో బుధవారం అర్ధరాత్రి జరిగిన కారు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందారు.
బలవంతపూర్ గ్రామానికి చెందిన రాజు, ఆయన భార్య భాగ్య, పిల్లలు నియాన్ష్, శాన్విక ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న బావిలోకి దూసుకెళ్లడంతో ఈ ఘోరం జరిగింది.
కుటుంబ సభ్యుల సమాచారంతో పోలీసులు సెల్‌ఫోన్ సిగ్నల్ ట్రాక్ చేసి కారును బావిలో గుర్తించగా, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.