శరీరంలో ఐరన్ తగినంత లేకపోతే కణాలకు ఆక్సిజన్ అందక తీవ్రమైన అలసట, బలహీనత కలుగుతాయని హెల్త్‌లైన్ తెలిపింది.
ఐరన్ లోపం కారణంగా హిమోగ్లోబిన్ స్థాయిలు పడిపోయి ముఖం, పెదవులు పాలిపోయినట్లు కనిపిస్తాయని నిపుణులు పేర్కొన్నారు.
దీనివల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కొద్దిగా నడిచినా ఆయాసం రావడంతో పాటు గుండె దడ వంటి సమస్యలు ఎదురవుతాయి.