
యూజర్లు ఇతర నెట్‌వర్క్‌ల వైపు వెళ్తుండటంతో భారతి ఎయిర్‌టెల్ తన రూ.299 ఎంట్రీ లెవెల్ ప్లాన్‌ను తిరిగి ప్రవేశపెట్టింది.
అయితే ఈ ప్లాన్‌లో రోజువారీ డేటా ప్రయోజనాన్ని 1.5 జీబీ నుంచి 1 జీబీకి కుదించగా, 28 రోజుల వాలిడిటీతో ఇది లభిస్తుందని ఎయిర్‌టెల్ యాప్, వెబ్‌సైట్ తెలిపాయి.
సెప్టెంబర్ త్రైమాసికంలో కొత్త యూజర్ల సంఖ్య నికరంగా తగ్గడంతో, కంపెనీ ప్రీమియం ప్లాన్ల వైపు వెళ్లినట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.