
అమరావతిలో సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ ముఖ్య నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, స్థానిక సంస్థల ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు.
కూటమి అధికారంలోకి వచ్చాక చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను, ప్రభుత్వ సేవల సులభతరాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని ఆయన సూచించారు.
ప్రతి పోలింగ్ బూత్లోనూ 2024 ఎన్నికల కంటే ఎక్కువ ఓట్లు పడేలా చూడాలని, కూటమి పార్టీల మధ్య సమన్వయం ఉండాలని అగ్రనేతలను ఆదేశించారు.