నీటిలో వ్యాయామాలు చేయడం వల్ల కీళ్లపై భారం పడకుండా కండరాలు టోన్ అవుతాయని, ఆర్థరైటిస్ బాధితులకు ఇది మంచి ఎంపికని క్లీవ్లాండ్ క్లీనిక్ తెలిపింది.
స్విమ్మింగ్ వంటి వాటర్ వర్కౌట్స్ గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, రక్తపోటును తగ్గించి రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి.
ఈ వ్యాయామాలు కేలరీలను వేగంగా బర్న్ చేయడమే కాకుండా, ఎండార్పిన్లను విడుదల చేసి ఒత్తిడిని తగ్గించి మంచి నిద్ర పట్టేలా చేస్తాయి.