తిరుపతిలో జరుగుతున్న అమరావతి ఛాంపియన్‌షిప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డ్రోన్ బ్యాటరీ ఛార్జింగ్ తగ్గి కింద పడటంతో ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత చేతికి స్వల్ప గాయమైంది.
ఈ క్రీడా పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా 9,911 మంది క్రీడాకారులు పాల్గొంటుండగా, అండర్-17 విభాగంలో 614 జట్లు, అండర్-23 విభాగంలో 545 జట్లు తమ సత్తా చాటనున్నాయి.
ఆగస్ట్ 29న విజయవాడలో జరగనున్న ముగింపు వేడుకల్లో మంత్రి నారా లోకేష్ విజేతలకు నగదు బహుమతులు అందజేస్తారని శాప్ ఛైర్మన్ రవినాయుడు తెలిపారు.