
పాకిస్థాన్ మాజీ ప్రధాని, క్రికెట్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ రావల్పిండిలోని అదియాలా జైలులో ఉంటూ ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్లు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇమ్రాన్‌కు మెరుగైన వైద్యం మరియు న్యాయ సహాయం అందేలా పాకిస్థాన్ ప్రభుత్వంపై దౌత్యపరంగా ఒత్తిడి తేవాలని కోరుతూ ఆసీస్ విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్‌కు ఏడుగురు మాజీ కెప్టెన్లు లేఖ రాశారు.
అలెన్ బోర్డర్, గ్రెగ్ చాపెల్, స్టీవ్ వా తదితరులు సంతకాలు చేసిన ఈ లేఖ ద్వారా ఖైదీకి లభించాల్సిన కనీస మానవతా ప్రమాణాలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.