
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం సోమవారం నాటికి తీవ్ర వాయుగుండంగా బలపడి, ఒడిశాలోని బాలాసోర్, పశ్చిమ బెంగాల్లోని హల్దియా మధ్య కేంద్రీకృతమై ఉంది.
ఈ తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ప్రస్తుతం ఈ వ్యవస్థ ఉత్తర దిశగా పయనిస్తూ తీరం దాటే ప్రక్రియలో ఉందని అధికారులు వెల్లడించారు.