
స్పెయిన్లో ఇళ్ల కొరత, విపరీతంగా పెరిగిన అద్దెలు, బలవంతపు ఖాళీలపై ప్రజాగ్రహం కట్టలు తెంచుకోవడంతో రాజధాని మాడ్రిడ్తో పాటు 50 నగరాల్లో పదివేల మందికి పైగా వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేపట్టారు.
ప్రభుత్వం ప్రతిపాదించిన అత్యవసర గృహనిర్మాణ చర్యలను పార్లమెంట్ తిరస్కరించిన మరుసటి రోజే ఈ నిరసన ప్రదర్శనలు జరగడం విశేషం.
ప్రస్తుతం స్పెయిన్లో దాదాపు 7 లక్షల ఇళ్ల కొరత ఉండగా, 2025లో సగటున అద్దెలు 8.5% పెరిగినట్లు అంచనా.