
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విశాఖపట్నంలోని ఇనార్బిట్ మాల్లో అత్యాధునిక హంగులతో కూడిన 'ఏఏఏ సినిమాస్' మల్టీప్లెక్స్‌ను ప్రారంభించారు.
ఈ మల్టీప్లెక్స్‌లో భారతదేశంలోనే మొదటి ఎల్ఈడీ ప్రొజెక్షన్ క్యూ-లక్సన్ స్క్రీన్‌ను ఏర్పాటు చేయగా, మొత్తం 8 స్క్రీన్లు, 1,556 సీటింగ్ సామర్థ్యం ఉన్నాయి.
విఐపి అతిథుల కోసం ప్రత్యేకంగా 'ఐకాన్ స్టార్ లాంజ్', '82 లాంజ్'లను అందుబాటులోకి తెచ్చినట్లు యాజమాన్యం తెలిపింది.