
నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ద ప్యారడైజ్’ సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో కేవలం నైజాం ఏరియాలో మాత్రమే ప్రారంభించిన అడ్వాన్స్ బుకింగ్స్‌లో క్షణాల్లో టికెట్లు అమ్ముడయ్యాయి.
బుక్‌మైషో, డిస్ట్రిక్ట్ యాప్‌లలో కలిపి కేవలం గంట వ్యవధిలోనే దాదాపు 25 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయి ట్రేడ్ వర్గాలను విస్మయపరిచాయి.