
నైరుతి రుతుపవనాల ప్రభావంతో హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
గత 24 గంటల్లో కామారెడ్డిలో అత్యధికంగా 18.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా, వికారాబాద్ మరియు సంగారెడ్డి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసినట్లు అధికారులు వెల్లడించారు.
క్యూములోనింబస్ మేఘాల కదలికల వల్ల ఆకాశం మేఘావృతమై ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.