
విదేశీ పౌరసత్వం కలిగిన భారత సంతతి వ్యక్తుల (ఓసీఐ) కార్డులున్న యువ క్రికెటర్లకు బాంబే హైకోర్టు సూచన చేసింది.
భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనే ఆకాంక్ష ఉంటే, ముందుగా భారత పౌరసత్వం తీసుకోవడంపై దృష్టి పెట్టాలని కోర్టు హితవు పలికింది.
బీసీసీఐ టోర్నమెంట్ల కోసం భారత పాస్పోర్ట్ తప్పనిసరి చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ 12 మంది ఓసీఐ యువ క్రికెటర్లు పిటిషన్ దాఖలు చేశారు.