
ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ప్రోటోకాల్ పాటించలేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను రాకముందే అధికారులు లక్కీ డ్రా ప్రారంభించడంతో నిరసనగా దానం నాగేందర్ కార్యక్రమం మధ్యలోనే వెనుదిరిగారు.
హైదరాబాద్ కోర్ అర్బన్ ప్రాంతంలో నాలుగు రోజుల పాటు ఇళ్ల కేటాయింపు ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది.