
నేపాల్ తొలి మహిళా హెలికాప్టర్ కెప్టెన్ ప్రియా అధికారి, నేపాల్-టిబెట్ సరిహద్దుల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏడు రోజుల్లో 100కు పైగా రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించారు.
ప్రమాదకరమైన లోయలు, దట్టమైన పొగమంచు, బురద నేలల మధ్య హెలికాప్టర్‌ను అదుపు చేస్తూ వందలాది మంది బాధితులను ఆమె సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
2015 భూకంపం కంటే ఈ విపత్తు దారుణంగా ఉందని పేర్కొన్న ప్రియా, ఇంజిన్ ఆపితే విమానం దిగబడిపోయే ప్రమాదం ఉన్నా, ప్రాణాలకు తెగించి సహాయక చర్యలు చేపట్టారు.