
నేపాల్లో మానసరోవర్ యాత్రకు వెళ్లిన పార్వతీపురం పట్టణానికి చెందిన సంతోష్ కుమార్ సాహూ కుటుంబం వరదల్లో గల్లంతయ్యారు.
సంతోష్ కుమార్ (47), భార్య సురభి (43), కుమారుడు స్పందన్ (18), కుమార్తె సైనా (13) ప్రయాణిస్తున్న వాహనం వంతెనపై వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది.
గత 20 ఏళ్లుగా లండన్లో స్థిరపడిన ఈ కుటుంబం ఆచూకీ కోసం నేపాల్ గైడ్ ద్వారా సమాచారం అందడంతో బంధువులు ఆందోళన చెందుతున్నారు.