
ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకుని సముద్రంలో కొనసాగుతూ నేడు తీవ్ర అల్పపీడనంగా బలపడనుంది.
దీని ప్రభావంతో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు కోస్తాలో ఎక్కువచోట్ల, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.