
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ సోమవారం టెహ్రాన్ సందర్శిస్తారని ఇరాన్ విదేశాంగశాఖ ఆదివారం ప్రకటించింది.
మునీర్ పర్యటన లక్ష్యాలు ఇరాన్, పాకిస్థాన్‌ల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడం, పశ్చిమాసియాలో శాంతి స్థాపన అని ఇరాన్ ప్రతినిధి ఇస్మాయిల్ బఘేయీ తెలిపారు.
అయితే, తమ ఆర్మీ చీఫ్ ఇరాన్ పర్యటనకు సంబంధించి పాకిస్థాన్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా వెలువరించలేదు.