
స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సమయంలో రాయచోటి, పుంగనూరు ప్రాంతాల్లో జరిగిన అల్లర్లపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అనిల్ చంద్ర పునేఠా సీరియస్ అయ్యారు.
సంబంధిత నివేదికలు అందగానే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
పోలింగ్ కేంద్రాల్లో అన్ని చోట్లా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.