
గోకవరం మండలం భూపతిపాలెం ప్రభుత్వ బాలుర రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థులకు జి. కొత్తపల్లి పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ తిరన్ ఆధ్వర్యంలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జి. అశోక్ కుమార్ సమక్షంలో విద్యార్థులకు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులపై అవగాహన కల్పించారు.
ప్రతి వారం ఫ్రైడే డ్రైడే పాటించాలని, పరిసరాల పరిశుభ్రత మరియు పౌష్టికాహారం ప్రాముఖ్యత గురించి వైద్య సిబ్బంది విద్యార్థులకు వివరించారు.