
చైనా ఆటోమొబైల్ దిగ్గజం బీవైడీకి చెందిన లగ్జరీ బ్రాండ్ 'డెంజా' త్వరలో భారతీయ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లోకి ప్రవేశించనుంది.
సోషల్ మీడియా వేదికగా 'త్వరలో వస్తున్నాం' అని ప్రకటిస్తూ సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది.
మొదటి మోడల్‌గా 1,156 హార్స్‌పవర్ శక్తిని ఉత్పత్తి చేసే మూడు ఎలక్ట్రిక్ మోటార్లతో కూడిన 'డెంజా Z9 GT' కారును విడుదల చేసే అవకాశాలున్నాయి.