
బెంగళూరులో జరిగిన దులీప్ ట్రోఫీ రెండో సెమీఫైనల్లో నార్త్ జోన్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించి సౌత్ జోన్ జట్టు ఫైనల్‌కు చేరుకుంది.
కెప్టెన్ తిలక్ వర్మ తొలి ఇన్నింగ్స్‌లో 116 నాటౌట్, రెండో ఇన్నింగ్స్‌లో 51 నాటౌట్ స్కోరుతో రాణించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
సెప్టెంబరు 6న చెపాక్ స్టేడియంలో జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ సారథ్యంలోని ఈస్ట్ జోన్‌తో సౌత్ జోన్ తలపడనుంది.