
మూత్ర విసర్జన తర్వాత చుక్కలు కారడాన్ని వైద్య పరిభాషలో 'పోస్ట్ మిక్ట్యూరిషన్ డ్రిబ్లింగ్' అంటారని, ఇది పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు.
ప్రొస్టేట్ గ్రంథి వాపు, కటి కండరాలు బలహీనపడటం, నాడీ సంబంధిత సమస్యలు అనేవి ఈ సమస్యకు ప్రధాన కారణాలుగా ఉండవచ్చని నిపుణులు వివరిస్తున్నారు.
మూత్ర విసర్జనలో మంట, నొప్పి, ఆగి ఆగి రావడం లేదా రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని డాక్టర్ భాను మిశ్రా సూచించారు.