
రష్యా సైన్యంలో చేరిన మొత్తం 227 మంది భారతీయులలో ఇప్పటివరకు 51 మంది మరణించారని విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ సోమవారం వెల్లడించారు.
ప్రస్తుతం రష్యా సైన్యం నుంచి 139 మంది భారతీయులు డిశ్చార్జ్ అయ్యారని, మిగిలిన వారిని వెనక్కి రప్పించేందుకు రష్యాతో నిరంతరం చర్చలు జరుపుతున్నామని ఆయన తెలిపారు.
భారతీయులను త్వరగా సైన్యం నుంచి విడుదల చేయాలని మాస్కోలోని భారతీయ ఎంబసీ రష్యా అధికారులను కోరుతూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని విదేశాంగ శాఖ పేర్కొంది.