
బీయింగ్ హ్యూమన్ జ్యువెలరీ షోరూమ్ పేరుతో మోసం చేశారనే ఆరోపణలపై నటుడు సల్మాన్ ఖాన్‌కు చండీగఢ్ జిల్లా కోర్టు నోటీసులు జారీ చేసింది.
ఈ కేసులో సల్మాన్ ఖాన్‌తో పాటు ఆయన సోదరి అల్విరా ఖాన్‌కు కూడా కోర్టు సమన్లు జారీ అయ్యాయి.
జ్యువెలరీ షోరూమ్ పేరుతో రూ. 3 కోట్ల మేర మోసం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.