
దేశంలో వంటగ్యాస్ కొరతను నివారించేందుకు కేంద్రం 21 రిఫైనరీలు, అప్‌స్ట్రీమ్ కంపెనీలకు రోజుకు 63,810 టన్నుల ఎల్‌పీజీ ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఈ లక్ష్యం దేశ మొత్తం రోజువారీ వినియోగమైన 91,000 టన్నులలో సుమారు 70 శాతానికి సమానమని పెట్రోలియం మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
గుజరాత్‌లోని రిలయన్స్ ఇండస్ట్రీస్ రిఫైనరీకి రోజుకు 18,000 టన్నుల గరిష్ఠ ఉత్పత్తి లక్ష్యాన్ని కేటాయించగా, ఈ షెడ్యూల్‌ను ఏటా జనవరి 1, జులై 1 తేదీల్లో సమీక్షిస్తారు.